నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఎన్టీఆర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో 7వ రోజు రాస్తారోకో నిర్వహించి కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను అందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేస్తూ తమ నిరసనను వెలిబుచ్చడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేయకుండా ఉండాలని ఉద్దేశంతో అనంతరం రాస్తారోకోను విరమించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే మహిళలు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలుగా గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు జరపటంలో 9 సంవత్సరాలు దాటినప్పటికీ కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయకపోవడంతో ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ వివిధ పద్ధతుల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని అందుకు.
ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపటానికి కృషిచేపూటంతోటే ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని వారు అన్నారు. పేద ప్రజలకు అంటువ్యాధులు విస్తరించకుండా అదేవిధంగా కరోనా సమయంలో అనేక రకాల సేవలు అందించిన మహిళల పట్ల చులకన భావం ఉండకూడదని వెంటనే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఏఎన్ఎంలు ఉద్యోగుల సంఘాల నాయకులు పుష్ప మరియు గంగా, జమున, కవిత, సుజాత, నాగలక్ష్మి ,తదితరుల పాల్గొన్నారు.