నిజామాబాద్ A9 న్యూస్:
బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా మూడవసారి టికెట్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రావడంతో ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మూడవసారి టికెట్ రావడం హర్షించదగ్గ విషయమని, భారీ మెజారిటీతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే భారీ మెజార్టీతో ఆయన్ను గేలిపిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.