నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమితులైన ఎం జె ఆసుపత్రి అధినేత, చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధు శేఖర్ ను ఆర్మూర్ పట్టణంలోని ఎం జె ఆసుపత్రిలో పలువురు కలిసి శాలువా పూలమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువులు నాయకులు తో పాటు దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాస్టర్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ మధు శేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చినందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.