నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమానమేతం ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రతి నెల జీతాలు ఐదో తేదీలోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, తదితరులు ఉన్నారు.