నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణంలో బీసీ గర్ల్స్ సంక్షేమ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్‌కు ప్రతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్, మాట్లాడుతూ ఆర్మూర్ బీసీ బాలికల వసతి గృహంలో ప్రభుత్వం మెనూ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తు, సెల్‌ఫోన్ అనుమతిస్తూ, సమయపాలన పాటించని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఏరియా ఉపాధ్యక్షుడు నవీన్, నాయకులు నితిన్, అరవింద్, మహిపాల్ తదితరులు ఉన్నారు.