నిజామాబాద్ A9 news

ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గృహం అంకాపూర్ నందు ఆర్మూర్ నియోజకవర్గం నుండి నూతనంగా నిజామాబాద్ జిల్లా పదాధికారిగా నియామకమైనటువంటి జెస్సు అనిల్ కుమార్ కు ఆత్మీయంగా ఆహ్వానించి బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి సన్మానించడమైనది. ఈ సందర్భంగా తనను జిల్లా అధికార ప్రతినిధిగా నియామకం చేసిన రాష్ట్ర మరియు జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ. జిల్లా నాయకత్వ మార్గదర్శనంలో సలహా, సూచనల, మేరకు, జిల్లా పార్టీ సహకారంతో పార్టీ అభివృద్ధికై కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్, గోవింద్ పేట్ సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు ధోండి ప్రకాష్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, ఓబీసీ మోర్చా ఆర్మూ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *