నిజామాబాద్ A9 news
ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామం నుండి వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు.
శనివారం ఆర్మూర్ నుండి బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తరలివెళ్లి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి గోవింద్ పేట్ గ్రామం నుండి అమీనాపూర్ వరకు బీటీ రోడ్డు వేయించాలని కోరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసిన వారిలో గోవింద్ పెట్ సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్, ఆర్మూర్ మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ తదితరులు ఉన్నారు.