నిజామాబాద్ A9 news
అణగారిన బడుగు బలహీన వర్గాలకు బాహుబలిగా సర్దార్ సర్వాయి పాపన్న నిలిచాడని అన్నారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణకేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల హౌసింగ్ బోర్డ్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం అధ్యక్షులు ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగ గౌడ్, స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్ లు హాజరై మాట్లాడారు. అనంతరం సంఘం అధ్యక్షుడు మంతెన లింబ గౌడ్ , సంఘం కార్యదర్శి భూమా గౌడ్, సురేందర్ గౌడ్ లు మాట్లాడుతూ సర్వాయి పాపన్న బాల్యం నుండే బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచాడన్నారు.
ఆనాటి రజాకారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు. 1650వ సంవత్సరంలో ధర్మన్న గౌడ్, సర్వమ్మ దంపతులకు గౌడ కులంలో జన్మించిన పాపన్న ఆనాడు సమాజంలో బడుగులపై జరుగుతున్న అణచివేత ధోరణికి వ్యతిరేకంగా నిలిచిన వీరుడు అన్నారు. జాగిర్దారులకు, జమీందారులను వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి వారి ఆస్తులను కొల్లగొట్టి సామాన్యులకు పంచిన మహనీయుడన్నారు.
కేవలం పది మందితో ప్రారంభించిన తన సైన్యాన్ని 3000 లకు పైగా సైనిక రాజ్యాన్ని తయారుచేసుకొని ఆనాటి తురుష్కుల పాలనను గడగడలాడించాడని అన్నారు. సుమారు 20 కోటాలను వశపరచుకొని తన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆనాటి మహా మేధావని పేర్కొన్నారు. దైవభక్తి మెండుగా గల పాపన్న హుజురాబాద్ లో ఎల్లమ్మ మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడని చెప్పారు.300 సంవత్సరాలకు పూర్వమే విప్లవ మంటే ఏమిటో ప్రజలకు తెలియచెప్పిన మహా యోధుడు, పురుషుడని సర్వన్నను అభివర్ణించారు.
సామాజిక న్యాయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పాపన్నను ఆనాటి సామంతులు పగబట్టి నాటి నవాబులకు బాసటగా నిలిచి పాపన్న పై యుద్ధాన్ని పులిగోల్పారని వివరించారు. 1707 నుండి సర్వాన్నపై పలుమార్లు యుద్ధాలు ప్రకటించినప్పటికీ చివరికి 1710వ సంవత్సరంలో పాపన్నను మట్టుపెట్టారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు భూమా గౌడ్, బోజా గౌడ్, కుంట గోవర్ధన్ గౌడ్, సించు నారా గౌడ్, బత్తిని నారా గౌడ్, కంచర్ల లింగాగౌడ్, చందర్ సురేందర్ గౌడ్, పూదరి శ్రీకాంత్ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ధర్పల్లి ముఖేష్ గౌడ్, ఎలుక రాజేందర్ గౌడ్, బండి శంకర్ గౌడ్, గౌడ కులస్తులు సాయినాథ్ గౌడ్, రాజేందర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఆత్మ చరణ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.