నిజామాబాద్ A9 news
ఆర్మూర్ నియోజకవర్గంలోని దేగం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపించిన దేగం గ్రామస్తులు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్.వై.పి. రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీపీ మోతే రామ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు ఆపద్బాంధవుడిగా 373 సంవత్సరాల క్రితమే పేదల పెన్నిధిగా బహుజన కులవృత్తులకు పెద్దన్నగా నిలిచిన మహారాజ్ సర్వాయి సర్దార్ పాపన్న అని వారు తెలిపారు.
బహుజన చక్రవర్తి గా అగ్రకుల అహంకారాన్ని అనగతొక్కి శత్రువులను తరిమికొట్టి కులానికో కోటకట్టి రాజ్యాన్ని అప్పగించిన మహనీయులు
బహుజన కులదైవాల గౌరవించి గుళ్ళు గోపురాలు కట్టించి బహుజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక మహనీయులు, బహుజన బంధువు సర్దార్ సర్వాయి పాపన్న మహరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం, టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు దేగాం యాదగౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ నాయకులు, గౌడ కులస్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు.