హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మే 15 వరకు స్టేటస్ కో పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి రూ.10వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.