A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడిగా మీనుగు రంజిత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో భీమన్న గుడిని అందరి సహకారంతో నిర్మిస్తానని, ఆదివాసులకి వచ్చే అన్ని ప్రభుత్వ పథకాలను అమలయ్యే విధంగా చూస్తానని నాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన కుల పెద్దలకు అందరికీ ఆయన కృతజ్ఞతలు
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆదివాసి నాయకపోడు ఉద్యోగుల సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కోసేడుగు రవి.నాయకపోడు మండల ప్రధాన కార్యదర్శి మేడిపల్లి గౌతమ్, చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు మేడిపల్లి శ్రీకాంత్, మీనుగు రవిశంకర్, నాయకులు మీనుగు నాగరాజ్ మేడిపల్లి సాగర్, మాజీ ఆదివాసి నాయకపోడు అధ్యక్షులు మేడిపల్లి గిరీష్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.