అతివేగమే కారణం అంటున్న స్థానికులు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని నిజం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద (ఏపీ 25 ఏఎం 7607) నంబర్ గల టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వడ్డే గంగాధర్ అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. (టీజీ 29 టి 2989) నంబర్ గల లారీ డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సి.ఐ సత్యనారాయణ ఘటనకు గల కారణాలను తెలుసుకొని మృతిని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.