*నిరుపేద హక్కుల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి వెల్లడి.

*ప్రజలారా మేధావులారా ప్రపంచమంతా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఎ9 న్యూస్, ఏప్రిల్ 15:

ప్రజలారా కార్మికులారా ప్రజాప్రతినిధులారా బుద్ధి జీవులారా అనే నినాదంతో ఒక ప్రకటన విడుదల చేశారు .గజ్వేల్ పట్టణంలో లక్ష్మీ ప్రసన్న మా కార్యాలయంలో సిద్దిపేట కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి అధ్యక్షతన అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరిగిందని, దీనికి గజ్వేల్ మండల కమిటీ కన్వీనర్ బండారి నాగులు మరియు రాయపోలు చేర్యాల తోగుట మండల కమిటీ కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఎదుల లక్ష్మీ, నరసింహ రెడ్డ ,బోయిన గోపాల్ ,అలాగే సిద్దిపేట జిల్లా ఇన్చార్జినరసన్న ఈ సభలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా అంబేద్కర్ కు తోగుట మండల కమిటీ కన్వీనర్ చంద్రన్న పూలమాల సమర్పించి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది.ఆ తర్వాత జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ అత్యంత వెనుకబడినటువంటి కులంలో నే కాకుండా అందులో ఇంకా అత్యంత వెనుకబడ్డ కులమైనటువంటి మహార్ జాతిలో జన్మించడం జరిగింది. అంబేద్కర్ మధ్యభారతంలోని మహువ అనే గ్రామంలో జన్మించడం జరిగింది తండ్రి రాంజీ సైనిక శిక్షణ బోధకునిగా పనిచేశాడు. ఆయన కొంతకాలానికి ఆ పదవికి రాజీనామా చేసి ఆయన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా దపోలిగ్రామంలో స్థిరపడ్డాడు అంబేద్కర్ రాంజీకి 14వ సంతానం అంబేద్కర్ జన్మించిన ఐదు ఆరు నెలల కాలంలోనే తల్లి మరణించింది పిన్ని మీరాబాయి అంబేద్కర్ కు తల్లి లేని లోటును తీర్చింది అంబేద్కర్ 1907లో మెట్రిక్ రేషన్ ఉత్తీర్ణత సాధించాడు. అంబేద్కర్ జయంతి ఐక్యరాజ్యసమితి 2020లో జరుపుకుంది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గడ్ చండీగఢ్ ఢిల్లీ గోవా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మొత్తం 25 పైగా రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. 1990లో అంబేద్కర్ కు భారతరత్న అవార్డు లభించింది. 1961, 1973, 1996, 2001, లో ఇండియన్ పోస్టు అంబేద్కర్ పోస్టులు విడుదల చేసింది. కేవలం భారతదేశంలోనే కాకుండా కెనడా ,బెల్బోర్న్, ఐర్లాండ్, మెక్సికో, శ్రీలంక, వర్మ, మయన్మార్ లాంటివి దేశాలలో అంబేద్కర్ జయంతిని సమానత్వ దినంగా జరుపుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ అనేక కష్టాల్ని దుఃఖాలని కడగండ్లని కన్నీళ్ళని అవమానాల్ని ఎన్నిటినో భరించి ఆయన ఈరోజు మనకు ఒక మార్గాన్ని దిశా నిర్దేశాన్ని ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆయనకు నివాళి అర్పించడం అంటే మొత్తం భారత ప్రజల యొక్క కష్టాలని కన్నీళ్ళని మనం తుడిచి పెట్టాలన్న ఆయన ఆశయానికి మనం దగ్గరవుతున్నట్టు లెక్క ఆయన కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా కుల మతాలకు అతీతంగా కార్మిక రంగానికి వ్యవసాయ రంగానికి విద్యార్థులకు మేధావులకు అసంఘటితరంగా కార్మికులకు దళిత ఆదివాసీలకు తనదైన మార్గాన్ని భారత రాజ్యాంగంలో చూపెట్టడం జరిగింది ప్రతి ఒక రంగంలో ఆయన తనదైన ముద్ర వేశాడు. ఆ మహనీయుని యొక్క ఆశయాలని సాధించడమే అంబేద్కర్ కు ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుంది .కాబట్టి మనమంతా అంబేద్కర్ ఆలోచన విధానానికి అంబేద్కర్ ఆశలకు కట్టుబడి ఉందామని ప్రతిజ్ఞ చేస్తూ అంబేద్కర్ కు ఘనమైన నివాళి సిద్దిపేట జిల్లా నిరుపేద హక్కుల సాధన సమితి తరపున జిల్లా కన్వీనర్ జిల్లా ప్రజల తరఫున కమిటీ తరఫున అంబేద్కర్ కు నివాళి అర్పిస్తున్నాం. అలాగే సిద్దిపేట జిల్లా ఇన్చార్జి నరసన్న మాట్లాడుతూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనకు అంబేద్కర్ చెప్పిన విషయాలు కాకుండా ఆయన బాటలో ఆ కాలంలో ఎందరో వీరులు మనకు ఒక మార్గాన్ని చూపెట్టారు అందులో సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అలాగే అంబేద్కర్ కూడా ఎవరి పద్ధతులలో వారు ప్రజలకు తమదైన మార్గాన్ని చూపెట్టారు కానీ దళిత ఆదివాసి షెడ్యూల్ ప్రాంత ప్రజలకు నిరక్షరాస్తులకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన కొన్ని ఎలా పొందాలో చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సందర్భంగా ఆయన ఆశయాన్ని కొనసాగించడమే నిరుపేద హక్కుల సాధన సమితి ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర ఇన్చార్జి నరసన్న చెబుతూ అంబేద్కర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నిరుపేదల హక్కుల సాధన సమితి తరపున జయంతి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అంబేద్కర్ ఆశయాన్ని ఇంకా పూర్తిగా సాధించలేదు. అట్టడుగు బలహీనవర్గాలు అవమానాలకు అణిచేతలకు గురవుతున్నారుతమ యొక్క నివాస ప్రాంతం నుండి వెలివేతకు గురవుతున్నారు. అభివృద్ధి పేరుతో వారికి జీవించే హక్కును పాలకవర్గాలు కాలరాస్తున్నాయి పీడితుల పక్షాన ఆదివాసుల పక్షాన మరియు బహుజన కులాల వారికి మనం అండగా ఉండడమే అంబేద్కర్ జయంతిని జరుపుకోవడంలో మనముఖ్య ఉద్దేశం అనిచెప్పడం జరిగింది. అలాగే కొలువూరు గ్రామంలో గజ్వేల్ మండల కమిటీ కన్వీనర్ బండారి నాగులు అధ్యక్షతన అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరిగింది.దీనికి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి జిల్లా ఇన్చార్జి నరసన్న జిల్లా కమిటీ సభ్యులు, మరియు మండల కమిటీ కన్వీనర్లు హాజరు కావడం జరింగింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *