*అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులతో సహపంక్తి భోజనం.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని రాత్రి 8 నుండి 10 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్ధపల్లి ఆశ్రమ్ హై స్కూల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థులతో భేటీ అయి వారి సమస్యలు, బాధలను అడిగి తెలుసుకున్నారు, పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

అనంతరం కంప్యూటర్ రూమ్, లైబ్రరీ రూమ్, మెడికల్ రూమ్, కిచెన్ సెక్షన్ లో గల వసతులను తనిఖీ నిర్వహించారు. వాటిని విద్యార్థులు ఏ విధంగా వాడుకుంటున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని,ఉన్నత స్థాయిలో ఉన్న వారిని స్ఫూర్తిదాయకముగా తీసుకొని వారి అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోని, తథానుగుణంగా విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో చదివి, తమ లక్ష్యాలను సాధించవచ్చు అని హితువు పలికారు. విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఈ దిగువ నినాదం విద్యార్థులకు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా డిచ్ పల్లి సిఐ మల్లేష్, డిచ్ పల్లి ఎస్సై ఎం.డి.షరీఫ్, ఆశ్రమ్ హై స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *