A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో విశ్వారత్న బాబసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా ఆర్మూర్ మండల ఉమ్మడి ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై అంబేద్కర్ కు పూల మాలతో నివాలులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబ సాహెబ్ అంబేద్కర్ అందరివాడు అయన ఆలోచన, ఆచరణ ఆదర్శనీయం, అనుసరణీయం ప్రపంచం అయన సుట్టు తిరుగుతుంది ప్రపంచ వ్యాపితంగా నేటికీ పదిలక్షల పైబడి అయన విగ్రహాలు పెట్టినారు అని గుర్తు చేసినారు కొందరు ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టలను దిగజార్చేవిధంగా వ్యవహారిస్తున్నారు రాజకీయంగా బలపడటానికి, వారి భావజాలా వ్యాప్తికి కొందరికి రాజ్యాంగం అడ్డుగా మారడంతో దీనిని తొలగించాలని కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. అంబేద్కర్ కొందరి వాడిగా చేసే కుట్రలను బగ్నం చేసి సమసమాజ, సమతా మూర్తి గా బహుజన వాదులుగా మనమే ప్రపంచానికి మరో సారి పరిచయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దమనుషులు, అంబేద్కర్ సంగం నాయకులు, పూలె అంబేద్కర్, యువజన సంగం నాయకులు మాజీ ఎంపీటీసీ మంతెన సంజీవ్, మార్ల ప్రభాకర్, సమీర్, పచ్చుక రాములు, చిన్నా గంగారాం, మార్ల శివకుమార్, సామెల్ మంగ్లారం నవీన్, రొడ్డ రాజేశ్వర్, స్వరూప, సవిత, చెన్నవ్వ,లత,రాణి, సోని, సాయమ్మ, ప్రజ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *