*భారతదేశ యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి AiPSU.
A9 news,
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AiPSU ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AIPSU రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్ మాట్లాడుతూ సమసమాజ స్వప్నికుడు,విశ్వ విజ్ఞాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,నవ భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశించినటువంటి సమాజాన్ని స్థాపించడంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా పయనించాలని అన్నారు.
రాజ్యంగం ద్వారా పటిష్టమైన పునాది ఏర్పరిచిన సమసమాజ స్వాప్నికుడు.
దేశం గర్వించతగిన మేధావి జాతి మేధోసంపద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో కుల మత ప్రాంత లింగ తారతమ్యాలు లేకుండా మానవ జాతి అంత సమానంగా ఉండాలని గొప్పశయంతో మనకు అందించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా కింద రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు మానేవరకు ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజా హక్కులను సాధించుకునేందుకు మహానుభావుడి ని ఆదర్శంగా తీసుకొని పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ , నగర అధ్యక్ష కార్యదర్శులు సునీల్, సందీప్, నాయకులు అర్జున్, శివ, ప్రసాద్, విజయసింగ్ ఠాకూర్ తదితరులు పాల్గోన్నార.