*పాత బస్టాండ్ కు బస్సులు రావా?.
అధికారుల నిర్లక్ష్యమా?.
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పట్టణ నడిబొడ్డులో గల పాత బస్టాండ్ పార్కింగ్ అడ్డగా మారిపోయింది. ఆర్మూర్ పట్టణ చరిత్రలోనే పాత బస్టాండ్ ఒక వెలుగు వెలిగిన ఘనత కలదు. అటువంటి పాత బస్టాండ్ కు బస్సులు రాక ఒక కల గానే మిగిలిపోతుందా. గతంలో పాత బస్టాండ్ నుండి ప్రతి గ్రామానికి వెళ్లే బస్సులు ఇక్కడి ప్రజలను రవాణాకు తీసుకుపోయాయి. అటువంటి పాత బస్టాండ్ నేడు బస్సులు రాక పార్కింగ్ అడ్డగా మారిపోయిందని ప్రజలు అంటున్నారు. కార్లు, బైకులు పార్కింగ్ చేయడంతో వాటి చాటుమాటున కాలకృత్యాలు తీర్చుకుంటున్న జనాలు. ఆర్టిసి బస్సుల రవాణా పాత బస్టాండ్ ప్రాంతంలో పెరిగితే ప్రాంతంలో అన్ని రకాల బిజినెస్ పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మళ్లీ పాత బస్టాండ్కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.