A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
అర్మూర్ పట్టణంలోని 10వ వార్డులో జై బాపు… జై భీమ్… జై సంవిధానం… ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. 10వ వార్డులో వాడ వాడ కి వెళ్లి కరపత్రాలు పంచి కార్యక్రమాన్ని కొనసాగించారు.
వినయ్ రెడ్డి మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మనకు అహింస, శాంతి సిద్ధాంతాలను అలవరచిన మహాత్మ గాంధీ గారిని స్మరించుకుందాం. రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ గారి ఆలోచనలను కాపాడుకుందాం. అందుకే జై బాపు… జై భీమ్… జై సంవిధాన్… నినాదాలతో ఉద్యమ కార్యాచరణ ఏఐసీసీ అగ్రనాయకత్వం రూపొందించింది 30 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,97,608 గ్రామాల్లో మరియు 7,933 పట్టణాల్లో నివసిస్తూ భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతదేశ నిర్మాణానికి
కోటానుకోట్ల సంఖ్యలో దృఢ నిశ్చయంతో జీవితాలను కోనసాగిస్తున్న భారతీయులను ఏకం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జిల్లాలో తొలిసారిగా ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ పట్టణంలో జై బాపు… జై భీమ్… జై సంవిధాన్… కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ పాదయాత్రలో భాగంగా మాజీ కౌన్సిలర్ కొంతం మురళి వార్డులోని సమస్యలను వివరించారు ఇతర సమస్యలు, తెలుసుకొని ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యకమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణ, ఏంఎంసీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, ఫయూమ్, ప్రవీణ్, కొంతం మురళి, మరియు నాయకులు జిమ్మీ రవి, మారుతీ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, థైసిన్, నదీమ్, వార్డు మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.