A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ అయ్యప్ప మహిళాసంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నా రెడ్డి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ దొడ్డు రకం రూ. 2320, కామన్ రకం రూ 2300. సన్న రకానికి 2300 ,ప్లస్ 500 రూపాయలు బోనస్ లభిస్తుందని వారు తెలిపారు. ఈ సౌకర్యాన్ని చేపూర్, పల్లె. గ్రామాలకు చెందిన ప్రతి ఒక్క రైతు సద్వినియం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటలను దళారులను నమ్మి అమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చేపూర్, పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, రామ్ సన్, తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న, మాజీ సర్పంచ్ కుస్తాపురం గంగారెడ్డి, ఓబిసి మండల అధ్యక్షుడు కటికే శ్రీనివాస్, క్రిస్టియన్ మైనారిటీ మండల అధ్యక్షుడు కంపదండి వినోద్, పల్లె విడిసి అధ్యక్షుడు ఎస్ రవి, కోశాధికారి జోరిగే నవీన్ జోరిగే చిన్న గంగాధర్, దామోదర్, సిఎలు సర్దా సంతోష సింధుకర్ అమల, అనిత, సిసి సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *