A9 న్యూస్, ఏప్రిల్ 9:
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్,కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.