తెలంగాణకు కొత్త ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వస్తున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎస్ శాంతకుమారి రిటైర్మెంట్ కాబోతున్నారు. దీంతో శాంత కుమారి స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కే.రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన వారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు కూడా వచ్చే ఆగస్టులో రిటైర్ అవనున్నారు. ఇక, 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పటి వరకు సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ ఏపీకి అలాట్ కావడంతో ఆమె సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు..