*అని సంకల్పంతో చేపట్టిన కార్యక్రమమే ఉచిత సన్నబియ్యం కార్యక్రమం.
ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన మాసాయిపేట మండలంలో పరిధిలో ఉన్న గ్రామాలు , చెట్ల తిమ్మాయిపల్లి, నడిమితాండ , పోతానుపల్లి , పోతిన్ శెట్టిపల్లి గ్రామాలలో ఉచితసన్నబియ్యం కార్యక్రమం అంగరంగ వైభవంగా మాసాపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది .అని మాసాయిపేట ఎంపీటీసీ మాజీ తాజా కృష్ణారెడ్డి తెలిపారు. అనంతరం పేదవాళ్లు గ్రామ ప్రజలతో పాటు గిరిజనులతో మాట్లాడుతూ పది సంవత్సరాలు స్వార్థం కోసం ఈ పథకం ఆ పథకం అనుకుంటూ మోసాలు చేస్తూ జైలు తిరుగుతున్నది ఎవరని ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సోనియమ్మ సన్న బియ్యం తెచ్చింది .కాంగ్రెస్ ఇప్పటికైనా వృద్ధులకు అనారోగ్య కారణాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న సరైన పోషణ ఆహారం లేక అకస్మాత్తుగా మరణాలు పెరగడంతో సన్నబియ్యం అనే పథకం ద్వారా పేద ప్రజల్లోకి వెళ్లాలని సన్నబియ్యం కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని మరొకసారి దీవించి ప్రతి లబ్ధిదారులకు ఎవరికి ఎలాంటి అన్యాయాలు కాకుండా ప్రతి ఒక్కరికి లబ్దులకు రేషన్ కార్డులు ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి వచ్చే వనరులు రాజ్యాంగం ప్రకారం సామాజిక ప్రజలకు గ్రామీణ ప్రాంత లోతట్టు ప్రజలకు చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని ముఖ్య నాయకులు, మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే శ్రీకాంత్ నాగిరెడ్డి , మా జీ డైరెక్టర్ ఉదండపురం నరసింహులు మాసాయిపేట మాజీ ఉపసర్పంచ్ ఊదండపురం నాగరాజు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ వార్డ్ సభ్యులు మరియు గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు పెంటరెడ్డి, సందీప్ రెడ్డి, జగన్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి,శ్రీకాంత్, రామ్ రెడ్డి, పోచయ్య, అంజాగౌడ్, రాజు, మియా ఖాన్, నరసింహులు గౌడ్, లంబాడి కిషన్, లంబాడి శ్రీను, . ప్రతి పథకం పేదవారి గడపగడపకు చేరడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన లక్ష్యమని నాయకులు పాల్గొని పేర్కొన్నారు.