నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ పట్టణ బూత్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలోని పదివేల ఓట్లకు ప్రతి 60 మందికి ఒక ఇన్చార్జిని, పది బూతులకు ఒక ఇన్చార్జిని నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరికీ వివరించి రాబోయే ఎన్నికల్లో నందిపేట పట్టణం నుండి మూడువేల ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, జీవన్ రెడ్డి గారిని 60 వేల కోట్ల మెజారిటీతో గెలిపించాలని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ కోరారు. కార్యకర్తలంతా ఐక్యమత్యంతో పని చేయాలని మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి కోరారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన, కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మునుగోడు ఎన్నికల మాదిరిగా, కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని జెడ్పిటిసి ఎర్ర ముత్యం కోరారు. ఈ కార్యక్రమంలో విలేజ్ కోఆర్డినేటర్స్ కుంట రాములు, అర్గుల రవి, డొంకేశ్వర్ ఎంపిటిసి శ్రీకాంత్, మండల ఎస్సి విభాగం అధ్యక్షుడు సంజీవ్, నందిపేట్ ఉపసర్పంచ్ భరత్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, ఎంపీటీసీలు బజరంగ్, మురళి, సీనియర్ నాయకులు చెక్ చెక్ ముత్యం, మజారుద్దీన్, బాలగంగాధర్, కావేరి గంగాధర్, మైనార్టీ అధ్యక్షుడు పాషా, హాయ్మధు ఖాన్, హుస్నావుద్దిన్,వార్డు మెంబర్లు మాన్ పూర్ భూమేష్, కొండి గంగాధర్, గంధం సాయిలు, రఫీ ఖాన్ నాని, యూత్ నాయకులు వినయ్, గంధం రాజశేఖర్, దినేష్, విజయ్, జూల రవి, దేశెట్టి రవి, స్వామి, అనిల్, బెంగళూరు సురేష్, విజయనగర్ నరేష్, దీపక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.