నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణంలో పి సి సి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ సహచర కాంగ్రెస్ నాయకులతొ కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన “తిరగబడదాం తరమికొడదాం ” కార్యక్రమం యొక్క వివరాలు కెసిఆర్, మోడీ ల గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసిన తీరు పై చార్జ్ షీట్ ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా నాయకులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార శాంఖరావంన్ని పూరించింది అని *తిరగబడదాం తరిమికొడదాం* అనె నినాదంతొ ప్రజల్లోకి వెళ్లి నెలరోజుల పాటు బి ఆర్ ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చి తప్పిన హామీలు అయినటువంటి దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికొక్క ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కేజీ టు పీజీ ఉచిత విద్యా, నిరుద్యోగ భృతి, గిరిజనులు మైనారిటీలకు రిజర్వేషన్ పెంపు, ప్రతి నియోజకవర్గంకి లక్ష ఎకరాలకు సాగు నీరు, మరియు ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి కాళేశ్వరం, ధరణి కుంభకోణం, ప్రభుత్వ భూముల అమ్మకం, విభజన హామీలు అమలు పర్చక పోవటం ప్రజల్లోకి వంటి వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అని ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సందేశం చేరవేయాలని అని అన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి పోస్ట్ కార్డు పై వారి సంతకం తీసుకోని ముఖ్యమంత్రికి పంపే పోస్టుకార్డు ఉద్యమంకి కూడా శ్రీకారం చూడుతున్నము అని అన్నారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్, బిజెపి లు తోడు దొంగలు అని వారు ప్రజలను మోసం చేసిన తీరు చార్జ్ షీట్ ను విడుదల చేశారు. త్వరలో ఆర్మూర్ నియోజకవర్గంలో కూడ స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై కూడ తన మరియు తన సోదరుడి మరియు అనుచరులు దోపిడీ దౌర్జన్యలపై చార్జ్ షీట్ విడుదల చేస్తాం అని, మొన్న పిసిసి ఆధ్వర్యంలో ప్రజా కోర్టు నిర్వహించి కెసిఆర్ కుటుంబంని బోనులో పెట్టి వారి అవినీతి అక్రమాలను బయటపెట్టిన విధంగా త్వరలో ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజ కోర్టు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే అవినీతి అక్రమలను ప్రజల ముందు పెడుతాం అని అన్నారు.
నెలరోజుల పాటు కార్యకర్తలు నాయకులు అందరు పార్టీ తీసుకున్న ఈ కార్యక్రమంని కష్టపడి పని చేసి విజయవంతం చేయాలనీ పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిమ్మి రవి, అజ్జు, బట్టు శంకర్, మీసాల రవి, బాల కిసన్, హబీబ్, శ్రీకాంత్, అవేజ్ తదితరులు పాల్గొన్నారు