Oplus_131072

 

హైదరాబాద్: ఏప్రిల్ 05

రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు,ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది, 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి, 2021 జనవరి నుంచి సి ఎస్ గా వ్యవహరిస్తున్నారు.

ఆమె పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది ఈ నేపథ్యంలోనే తదుపరి సి ఎస్ గా కె, రామకృష్ణారావు, పేరును ఖరారు చేసినట్లు సమాచారం.1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు.

రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్గోయల్తరువాత సీనియర్‌గా రామకృష్ణారావు ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయన కున్న అనుభవం తొడ్పడు తుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయనను సీఎస్‌గా నియమించాలనే ఆలోచన చేసినట్లుగా సమాచారం.

రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్కలెక్టర్‌గా, గుంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత సీఎస్శాంతి కుమారి, తన సర్వీసుకు వీఆర్‌ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఆమె వీఆర్ఎస్నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లుగా సమాచారం.

దీంతో కొత్త సీఎస్‌గా కె,రామకృష్ణారావును నియమించేందుకు ప్రభు త్వం నిర్ణయించి నట్లుగా సమాచారం. వాస్తవంగా శాంతి కుమారి ఈనెలఖరున పదవీ విరమణ చేయనున్నారు. అంత కంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్తీసుకో వాలని ఆలోచన చేస్తున్న ట్లుగా తెలిసింది

వీఆర్‌ఎస్ తరువాత శాంతి కుమారి ని చీఫ్ఇన్ఫర్మేషన్కమిషనర్‌గా నియమించ నున్నట్లుగా సమాచారం. ఆమె నియామకం ఇప్పటికే ఖరారు అయిందని, కేవలం అధికారిక ప్రక్రియ మాత్రమే జరగాల్సి ఉందని తెలి సింది. వచ్చే వారం సమాచార కమిషనర్‌లకు సంబంధించిన నియామక సమావేశం జరగనున్నట్లు గా తెలిసింది.

సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష తన జరిగే సమావేశంలో ఆమెతో పాటు మరికొందరు సమాచార కమిషనర్‌లుగా నియమించనున్నట్లుగా తెలిసింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *