ఈ రోజు ఇందల వాయి సీతారామ చంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు సాయంకాలం శ్రీవైష్ణవ బాగవతొత్తముల ఆధ్వర్యము లో అంకురార్పణ, వాసుదేవ పుణ్యాహవాచనం మత్సం గ్రహణం, ఋత్విక వరణం కార్యక్రమాలు యాజ్ఞీకులు శ్రీమాన్ శ్రీ కందాళ రాజగోపాలా చారి గారి నేతృత్వం లో ,వేద మంత్రోచ్ఛరణ ల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమం లో ఆలయ స్థానాచార్యులు శ్రీమాన్ తిరువళ్లూరు వీర రాఘవాచార్యులు ఆలయ అర్చకులు దీపక్ కందాళ బోనాల వినయ్ శర్మ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు నిర్వహణలో రామ మాలధారులు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.