హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల్లో 36,334 మంది విద్యార్థులు అర్హత సాధించారని సెక్రటరీ పత్రిక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన పరీక్షకు 89,246 మంది అప్లై చేసుకోగా, 84,672 మంది హాజరయ్యారు.

గురుకులాల్లో 5వ తరగతికి సంబంధించి 51,408 సీట్లు ఉన్నాయి. ఇటీవల దివ్యాంగులు, అనాథలు, ఫిషర్ మెన్, ఆర్మీ, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ, ఎంబీసీ కేటగిరీలకు చెందిన స్టూడెంట్స్ కు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేయగా 1944 మంది ఎంపిక అయ్యారు. ఇక మిగిలిన వివిధ కేటగిరీలకు చెందిన13,130 సీట్లకు గాను ఫలితాలను దశల వారీగా రిలీజ్ చేస్తామని సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *