ఎ9 న్యూస్ ఏప్రిల్ 4
హైదరాబాద్: గచ్చిబౌలి భూముల విషయంలో తదుపరి కార్యాచరణపై మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి X ద్వారా వెల్లడించారు.
ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. భూ సమస్య పరిష్కార దిశగా కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ, పౌర సమాజ ప్రతినిధులు, విద్యార్థుల ప్రతినిధులతో పాటు సంబంధిత స్టేక్ హోల్డర్లతో చర్చలు నిర్వహించనుంది.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.