*ఏఎన్ఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఏ ఆర్ ఆర్ గా అభివృద్ధిలో ముందుకు సాగుతా.
ఎ9 న్యూస్ మాసాయిపేట మార్చ్ 3
*తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి,ARR
గురువారం నాడు నర్సాపూర్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి నేడు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ లోని జాన్ ఫౌండేషన్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ కార్యక్రమం స్థానిక విద్యా అభివృద్ధి దిశగా కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, జాన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ప్రశంసించారు. ఇలాంటి సంస్థలు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం అభినందనీయమని తెలిపారు అనంతరం
మెదక్ మరియు నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజలు సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా తన సొంత గ్రామం మండలమైన శివారులో గల రామంతపూర్ గ్రామంలో స్కూల్లో ట్రస్ట్ సమావేశంలో ఆంగ్లంలో మాట్లాడుతుంటే మాసాయిపేట రామంతపురం ప్రజలు కేరింతలు చేశారు.
కార్యక్రమంలో పలువురు గౌరవ అతిథులు, సామాజిక నాయకులు పాల్గొని జాన్ ఫౌండేషన్ లక్ష్యాన్ని అభినందించారు.