*హనుమకొండలో బిజెపి జిల్లా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి. హనుమకొండ ఏప్రిల్ 6న నిర్వహించే భారతీయ జనతా పార్టీ బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనుమకొండ బిజెపిపార్టీకార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు. పెద్దోళ్ల గంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు సమావేశంలో జిల్లా నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 6న జరిగే బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగానిర్వహించుకోవాలని అన్నారు .పార్టీ గౌరవాన్ని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు .ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంజరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ,మాజీ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ ,రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ధర్మారావు ,చాడ శ్రీనివాసరెడ్డి ,డాక్టర్ సంతోష్ రెడ్డి ,డాక్టర్ గంగమోహన్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.