*పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి వెల్లడి.
ఎ9 న్యూస్ నర్సాపూర్ ఏప్రిల్ 3 :
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్ లో రేపు 4-4-2025 (ఉదయం 10:00 గంటలకు) నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి* & షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్న కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ విచ్చేయనున్నారు అని
పీసీసీ ప్రధాన కార్యదర్శి,
నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలిపారు. కావున, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.