*అడవులు లేకపోతే వర్షాలు లేవు ఆక్సిజన్ లేదు.
ఎ9 న్యూస్ మెదక్/సిద్దిపేట ఏప్రిల్ 3:
మిత్రులారా పర్యావరణ విత్తలారా, బుద్ధిజీవులారా, మేధావులారా గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని రెండు విశ్వవిద్యాలయాలు ఉస్మానియా యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయం ఈ రెండు కూడా రణరంగ కేంద్రాలు అయ్యాయి ఒకటి ప్రభుత్వం అడవిని కాపాడే బదులు ఆడవి కార్పొరేట్లకు అప్పజెప్పడానికి 400 ఎకరాలలో జెసిబిలు బుడోజర్లు పెట్టి అడవిని సర్వనాశనం చేస్తుంది. ఈ అడవిని కాపాడడం కోసం హెచ్సీయూ యూనివర్సిటీ విద్యార్థులు మేధావులు, ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరూ తమ శక్తిని వడ్డీ కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఉన్నది అడవిని కాపాడి, అడవి సంపదను కాపాడి తరతరాల వారసత్వానికి అందజేసిన బాధ్యత ప్రజా ప్రభుత్వాన్నిది మరి ఈరోజు అడవిని కాపాడమని మొత్తం విద్యార్థులు మేధావి లోకము అడుగుతుంటే, వారిని అమానుషంగా ఈడిసికెళ్ళి అరెస్ట్ చేయడం తగదు అలాగే విద్యార్థుల్ని ప్రతి సమస్య మీద అడగకుండా ప్రశ్నించే గొంతుని ఆపడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఆర్డర్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇట్లాంటి ఆర్డర్ ను రద్దు చేయవలసిందిగా పర్యావరణాన్ని కాపాడవలసిన అడవుల్ని కాపాడవలసిందిగా నిరుపేదల హక్కుల సాధన సమితి తరపున మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల హక్కుల్ని కాపాడతామని బాస చేసిన మీరు ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ పక్షంలో ప్రజలు అవకాశం దొరికినప్పుడు వారి పద్ధతుల్లో వారు తీర్పు చెప్తారని కూడా చెప్తున్నాం.
నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.