హైదరాబాద్: ఏప్రిల్ 03
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీఎన్నిక ఆసక్తిగా మారింది. రేపటితో నామినేషన్ల,గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పొలి టికల్ వేడి పెంచుతోంది.
బలాబలాల దృష్ట్యా అంతి మంగా పోటీలో ఎవరెవరు ఉండబోతున్నారు? మద్ధతు విషయంలో ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు రాబోతున్నది అనేది చర్చగా మారింది. హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు.
ఎంఐఎంకు 49 ఓట్లు, బీఆర్ఎస్ కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్ కు 14 ఓట్లు ఉన్నాయి. దీంతో బలాబ లాలను బట్టి ఏ పార్టీ ఎలాం టి వ్యూహంతో రాజకీయం నడిపించబోతున్నది అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
హైదరాబాద్ ఎమ్మెల్సీ విషయంలో అధికార కాంగ్రెస్ ఎంఐఎం (MIM) మధ్య చర్చలు తుదిదశకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సిట్టింగ్ స్థానం కావడంతో తమకు మద్దతు ఇవ్వాలని అలా చేస్తే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో సహకరిస్తామని, కాంగ్రెస్ కు ఎంఐఎం ఆఫర్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ ఎన్నికలో తమకే మద్దతు ఇవ్వాలని హైదరాబాద్ మేయర్ పీఠం ఇచ్చేలా ఎంఐఎంను కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలో ఎవరు డ్రాఫ్ అవుతారు? ఎవరు పోటీలో నిలుస్తారనేది ఉత్కంఠగా మారింది