కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లను కలుసుకొని వారిని పలకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ అదేవిధంగా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కరాచలనం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీలు తెలంగాణ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ అభివృద్ధిపై పలువురాలను అడిగి తెలుసుకున్నారు. బిసి పోరుబాట సందర్భంగా ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో పలు రఘురాన్ నేతలను కలుసుకున్నట్టు వారు తెలియజేశారు. రాహుల్ గాంధీని సోనియాగాంధీనీ ప్రత్యేకంగా కలుసుకుని మాట్లాడడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వీళ్ళ పల్లి శంకర్ తెలిపారు..