Apr 02, 2025,
ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం.!
జడ్చర్ల నియోజకవర్గం ఉర్కొండపేటలో మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై మంగళవారం మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ మేరకు కేసు పురోగతి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని రకాలుగా సహాయం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.