హైదరాబాద్: ఏప్రిల్ 02

గుజరాత్‌లోని దీసా పట్టణానికి సమీపంలోని పటాకుల గోదాములో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిం ది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు దుర్మర ణం చెందగా, ఆరుగురు గాయపడ్డారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాయిలర్‌ పేలడంతో గోదాము పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపు చేసిం దని చెప్పారు. మృతుల కుటుంబాలకు గుజరాత్‌ సీఎం రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పేలుడు తర్వాత గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం సంభవించిం దని ఎస్పీ అక్షయ్‌రాజ్ మక్వానా తెలిపారు.

పేలుడుకు గల కారణాన్ని తెలుసుకొనేందుకు ఫోరె న్సిక్ బృందాలు ప్రయత్ని స్తున్నాయన్నారు. ఈ గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నా రని తేలింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారి నేతృ త్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీసా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నేహా పంచల్ మాట్లాడు తూ..

గోదాంలో మొదట్లో బాణ సంచా నిల్వ చేసేందుకు లైసెన్స్ ఉందని.. కానీ డిసెంబర్ 31, 2024న గడువు ముగిసిన తర్వాత లోపాల కారణంగా దాన్ని పునరుద్ధరించలేదన్నారు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత వారు పునరు ద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

యూనిట్‌లో సరైన సౌక ర్యాలు లేవని అధికారులు గుర్తించి.. లైసెన్స్‌ పునరు ద్ధరణ ప్రక్రియ నిలిపివేసి నట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభు త్వం తరఫున రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

క్షతగాత్రులకు చెరో రూ.50వేలు చొప్పున ప్రకటించారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌ సీఎం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి కార్మికులు అక్కడ మృతిచెందడంతో వారికి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రుల కు రూ.50వేలు చొప్పున సాయం ప్రకటించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *