Apr 02, 2025,
ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ.వెయ్యి కోట్లు దాటిన ఆదాయం
తెలంగాణ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అధికారులు తెలిపిన ప్రకారం.. మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 15.27 లక్షల LRS దరఖాస్తులు రాగా.. వాటిలో 15,894 తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో 6.87 లక్షల ప్రాసెస్ అయ్యాయి. LRS ఫీజు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 8.65 లక్షలు. LRS ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన LRS దరఖాస్తులు 58,032గా ఉన్నాయి.