*ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మూడావత్ రాంబల్ నాయక్ అరెస్టు.
*కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు.
లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని లంబాడి హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం కేశంపేట మండల పోలీసులు రాంబాబు నాయక్ అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కడం కోసమే రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన నాయకులను అరెస్టు చేస్తుందని ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన లంబాడీలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు..