హైదరాబాద్: ఏప్రిల్ 01
ఎస్బీఐ సేవలకు మంగళ వారం అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్, ఫండ్స్ ట్రాన్స్ ఫర్, ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేసుకోవడం వంటి సేవలు నిలిచిపోయాయి.
ఉదయం 8:15 గంటల నుండి ఈ సమస్య తలె త్తింది. మధ్యాహ్నం 11:45 గంటల సమయంలో సమ స్య తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో ఎస్బీఐ సేవలు ఆగిపోవ డంపై ఫిర్యాదుచేసిన వారి సంఖ్య 800 కు పైనే ఉంది.
డౌన్‌డిటెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి 64 శాతం ఫిర్యాదులు వచ్చాయి. నగదు బదిలీ సేవలపై 33 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఇక ఏటీఎం సేవలకు సంబంధించి మరో 3 శాతం వినియోగదారులు రిపోర్ట్ చేశారు.
ఎస్బీఐ సేవలకు అంత రాయం జరిగిన మాట వాస్తవమేనని ఆ సంస్థ కూడా అంగీరించింది. తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎస్బీఐ, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో జరిగే కార్యక్రమాల కారణంగా…
ఏప్రిల్ 1 న మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎస్బీఐ డిజి టల్ సర్వీసెస్ అందుబాటు లో ఉండవు అని స్పష్టం చేసింది. ఆ సమయంలో ఎస్బీఐ కస్టమర్స్ యూపీఐ లైట్ లేదా ఏటీఎం సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా ఆ సంస్థ కోరింది.