సూర్యాపేట: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. 56 లక్షల రేషన్ కార్డులకు కేంద్రమే సన్నబియ్యం ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రం సన్న బియ్యమిస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పాలని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) సూర్యాపేటలోని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని బండి సంజయ్ అన్నారని.. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క నిలదీశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని ఆరోపించారు. ఇందులో బీజేపీ నాయకులు వాటాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఒక రూపాయి పంపిస్తే రూ.48 పైసలే తిరిగి వస్తున్నాయని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోలు పెడతారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *