హైదరాబాద్: మార్చి 24
హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో చెత్త చాటాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుండగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించు కోవాలని బిఆర్ఎస్ ప్రయ త్నిస్తుంది ఇక భాగ్యనగరం లో బోణి కొట్టాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తుండగా పంతంగి పార్టీ మాత్రం తన మార్క్ చూపించాలని యోచిస్తుంది…
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది, కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు విడుదల చేసింది.. మార్చి 28 న ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలలో మరో సారి ఎన్నికల వాతావరణాన్ని తీసుకురానుంది. మే 1వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ముగి యనున్న నేపథ్యంలో.. ఈ స్థానానికి కొత్త ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో కొమురయ్య విజయం సాధించారు.
ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్త ఉత్సా హాన్ని తెచ్చింది. అంతేకాక.. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అంజయ్య గెలుపొందారు. ఆయన విజయం తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 2014, 2018 ఎన్నికలలో బీజేపీ తెలంగాణలో తన మార్కును చూపించింది.
అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబో తున్నదనేది ఆసక్తికంరగా మారింది.