హైదరాబాద్:మార్చి 24

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబి య్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిం చింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో లాంఛ నంగా ప్రారంభించను న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది.

అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి సన్నా హాలు చేస్తోంది. ఇందులో భాగంగా పౌర సరఫరాల శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సొంత నియోజకవర్గ మైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30న ఉగాది పర్వది నం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్‌కు సీఎం రేవంత్ వస్తున్నారు.

రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేం దుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షలమెట్రిక్ టన్నుల ధా న్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిం చిన నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *