A9 న్యూస్ ప్రతినిధి:
ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మామిడిపల్లి లో భగత్ సింగ్ విగ్రహం వద్ద పీ.డి.ఎస్.యు మరియు ఐ.ఎఫ్.టీ.యూ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో షహీద్ దివస్ సందర్బంగా అమరవీరులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్బంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ఉపాధక్షులు సూర్య శివాజీ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాడికి ఎదురు నిలిచి కొట్లాడి, తమ ప్రాణాలనే అర్పించిన గొప్ప వీర కిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఇచ్చిన పోరాటస్ఫూర్తితో నేటి సమాజంలోని అసమానతలు, అణచివేతకి వ్యతిరేకంగా పోరాడాలని మరియు విద్యార్థులు తమ జీవితలలో వాళ్ళ స్పూర్తితో ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు మరియు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో ఒక ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తుందని ముఖ్యంగా పెట్టుబడి దారి విధానానికి ఊడిగం చేస్తుందని ఇటు కార్మికులకు రైతులకు నిరుద్యోగులకు విద్యా రంగానికి అన్యాయం చేశాడని ఆరోపించారు ముఖ్యంగా అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తానని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఏట రెండు కోట్ల కొలువులు ఇస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 44 లేబర్ చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని వారు మండిపడ్డారు. వీళ్ళ ఉద్యమ స్ఫూర్తిని కార్మికులు రైతులు యువకులు వారి హక్కుల సాధనకై పోరాడాలని సమసమాజ నిర్మాణం కై ఉద్యమించాలని వారు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. పీ.డి.ఎస్.యు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం, స్వేచ్చా స్వాతంత్ర్యం కోసం తమ విలువైన ప్రాణాలను భారత జాతికి అంకితం ఇచ్చారని, ఉరితాడును ముద్దాడి అమరులయ్యారని, ఇరవై మూడేళ్ళ వయసులో ఈ దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేయాలని, బ్రిటిష్ కర్కశ పాలనపై తమ తిరుగుబాటు జండను ఎత్తి, ఎన్ని చిత్ర హింసలు పెట్టినా వెనక్కి తగ్గకుండా తుడికంటా పోరాడిన వీర యోధులు అని అన్నారు. తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి చెప్పడం కోసం పార్లమెంటు భవనంలో బాంబులు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ, తమ భావాల్ని కరపత్రాల్లో ముద్రించి బ్రిటిష్ వాళ్లపైకి విసిరి , తాము దొరికిపోయినా తాము ఇచ్చిన చైతన్యంతో దేశంలోని అశేష ప్రజానీకం స్వాతంత్ర్య ఉద్యమం లోకి వస్తుందని, తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లిన వారు అన్ని అన్నారు. భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో విద్యార్థులు NEP 2020, యూజీసీ నూతన ముసాయిదాకు వెతిరేకంగా మరియు విద్యరంగా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వేచ్చా, స్వాతంత్ర్యం కోసం దోపిడీ, పీడన లేని నూతన వ్యవస్థ కోసం తిరుగుబాటుకి సిద్దం కావాలని హుస్సేన్ కోరారు. ఈ కార్యక్రమంలో పీ.డి.ఎస్.యు నాయకులు రాహుల్, సాయి, పవన్, గణేష్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.