A9 న్యూస్ ప్రతినిధి:
ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియ సమావేశం నిర్వహించిన పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ దేగాం ప్రమోద్ లు.
ఈ సందర్బంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు, పూటకో పార్టీ మారే వారు మా కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి ని, ఏబి చిన్న ని విమర్శించటం హాస్యాస్పదం అని అన్నారు, రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు కామన్ అని కాని అరవింద్ ని విమర్శిస్తే ఈ బిజెపి నాయకులు పిచ్చి పట్టిన వారిల మాట్లాడుతున్నారు అని, బిజెపి నాయకులకు అరవింద్ పై అంత ప్రేమ ఉంటే మీ రాకేష్ రెడ్డి దగ్గర నుండి గంధం తీసుకోని అరవింద్ గుండుకు పూసి పూజ చేసుకోండి అని అన్నారు, పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా 35 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పిసిసి అధికార ప్రతినిధిగా ఉంటూ ఆయన బాధ్యత నిర్వహిస్తే ఆయనను ఆర్మూర్ లో తిరగనివ్వం అనటం వాళ్ళ అజ్ఞానికి నిదర్శనం అని అన్నారు, సుదర్శన్ రెడ్డి చొరవతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది అని స్వయానా మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డి నీ పాదభివందనం చేస్తా అన్న మాటలు గుర్తు చేసాడు, ప్రభుత్వం ఏర్పాడాగానే మెదటి క్యాబినెట్ సబ్ కమిటీ నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ఏర్పాటు చేసారు అని, 200 కోట్లు బకాయిలు విడుదల చేయించాడు అని, ఈ బడ్జెట్ లో 180 కోట్లు కేటాయించడం జరిగింది అని అన్నారు, రైతుల వద్దకు వెళ్లి చెరుకు సాగు చెయ్యమని సదస్సులు నిర్వహించటం జరిగింది అని, మొన్ననే మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీ లను శ్రీధర్ బాబు తో సందర్శించడం జరిగింది అని అన్నారు. అంతే కాని అరవింద్ లాగ కాగితాలు మీద పసుపు బోర్డుల కాదు అన్నారు, నిజంగా అరవింద్ పసుపు బోర్డు తెస్తే నిజామాబాద్ మార్కెట్ లో పసుపు రైతులకు ఎందుకు మద్దత్తు ధర లభించటం లేదు అని అన్నారు, అరవింద్ ఒక టూరిస్ట్ ఎంపీ అని రెండు మూడు నెలలకు ఒకసారి జిల్లాకు వచ్చి ప్రజలు అయన గురించి మాట్లాడుకోడానికి ఏదో ఒక కాంట్రావర్శి క్రియేట్ చేసుకుంటాడు అని అన్నారు, అరవింద్ ని విమర్శించే అర్హత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది అని ఈరోజు అరవింద్ తింటున్న తిండి, ఉంటున్నా ఇళ్ళు తిరుగుతున్న కారు చేసుకుంటున్న వ్యాపారం, వేసుకుంటున్న బట్టలు అన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని అరవింద్ జీవితాంతం కాంగ్రెస్ కార్యకర్తల తిట్లు విమర్శలు వింటూ పడాల్సిందే అని అన్నారు, అరవింద్ తన అరెళ్ల పదవి కాలంలో కనీసం ఆర్మూర్ నిండి నిజామాబాద్ మధ్య నాలుగు వరుసల రోడ్డు పూర్తి చేయలేని దద్దమ్మ అరవింద్ అని, లోకమాన్య తిలక్ ట్రైన్ రద్దు అయితే ఇప్పటివరకు దాన్ని పునరుద్ధించని చవట అరవింద్ అని అన్నారు, ఆర్మూర్ నుండి జగదల్ పూర్ కి జాతీయ రహదారి ఇప్పటివరకు పట్టాలెక్కించని అసమర్ధ ఎంపీ అరవింద్ అని అన్నారు. పాపం బిజెపి మిత్రులు అరవింద్ తమకు ఏమో చేస్తాడో అని ఆశల పల్లకిలో ఉన్నారు అని అరవింద్ ఏమి చేయడు అని హితావు అన్నారు.
ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ దేగాం ప్రమోద్ మాట్లాడుతు కంచెట్టి గంగాధర్ మా నాయకుడు చిన్నా అన్న గురించి కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడుతూన్నాడు అని ఈ సందర్బంగా చెప్తున్న ఖాబర్దార్ కంచెట్టి, నువ్వు పెట్టుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని నువ్వు కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తావా, ఇప్పటివరకు నాలుగు పార్టీలు మారిన నువ్వా మాట్లాడేది రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు, హైదరాబాద్ లో ఉంటూ కూడ చిన్న అన్న రెండు సార్లు కౌన్సిలర్ గా గెలిచాడు అని, అన్నపూర్ణమ్మ ఎమ్మెల్యే గా ఉన్న 36 లక్షలు ప్రత్యేక నిధులు తెచ్చి తన వార్డు అభివృద్ధి చేసాడు అని, ఎమ్మెల్యే ఎన్నికల్లో పని చేయటానికి 20 లక్షలు తీసుకున్న నీవా విమర్శించేది, సుదర్శన్ రెడ్డి గారిని ఆర్మూర్ తీసుకు వచ్చి మీ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అయిన ఆయనను కూడ పిలిచి నియోజకవర్గంలో అభివృద్ధికి సహాయం చేసాడు అని, ఇంటిగ్రెటెడ్ స్కూల్, మున్సిపల్ బిల్డింగ్ కి 3 కోట్ల రూపాయలు జిహో వస్తుంది అని అన్నారు, కంచెట్టి గంగాధర్ ఎర్ర మాంజిల్ ఆఫీస్ కి వచ్చి ఏబి చిన్న కాళ్ళు మొక్కితె సుదర్శన్ రెడ్డి ఆదేశాలతొ నీకు చైర్మన్ పదవి వచ్చింది లేకపోతే బిసి భోజన్న చైర్మన్ అయ్యేవాడు అని అన్నారు. సుదర్శన్ రెడ్డి జిల్లాకు పెద్ద దిక్కు అని త్వరలో మంత్రిగా ప్రమాణం చేస్తాడు అని అన్నారు. నువ్వు రానున్న 36 వార్డుల్లో ఏ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ కార్యకర్త చేతిలో ఒడిస్తాం అని ఇదే నా సవాల్ అని అన్నారు.
మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు sk బబ్లు మాట్లాడుతూ నర్సింహా రెడ్డి పదేళ్లు కౌన్సిలర్ ఉన్న నీవు నిధులు కూడ తేలేవు ప్రజలు నిన్ను గెలిపిస్తే ఆ కౌన్సిలర్ పదవిని రెండు పర్యాయలు నీ ధనర్జనాకు వాడుకున్నావు అని నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది ఖబర్దార్ నర్సింహా రెడ్డి అని అన్నారు.
ఈ కార్యక్రమo లో నాయకులు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల కిషన్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడమిటి ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి షైక్ పాషా, మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సల్మాన్, ప్రధాన కార్యదర్శి రాటం అరుణ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు