హైదరాబాద్: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోగిలి సునీతా రావు ఆధ్వర్యంలో శనివారం బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించినప్పటికీ, ఇప్పటికీ అమలుచేయకపోవడం దురదృష్టకరమని సునీతా రావు మండిపడ్డారు. మహిళల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల మహిళా నేతలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.