*దళిత ప్రగతి సదస్సును ప్రారంభించిన కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్.

*ఈ సదస్సులో మంత్రి సీతక్క ప్రసంగించారు.

ఎ9 న్యూస్ మార్చ్ 23

మంత్రి సీతక్క మాట్లాడుతూ..

నమస్కారం కేరళ

కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్

ఈ రోజు మీ ముందు నిలబడి, అణగారిన మరియు బలహీన వర్గాల వాణి వినిపించడానికి గర్విస్తున్నాను

ఒక ఆదివాసి మహిళా గా మా అణగారిన వర్గాలు ఎదుర్కొనే కష్టాలు, అన్యాయాల్ని ప్రత్యక్ష్యంగా ఎదుర్కొన్న నేను, ఈ రోజు మీ ముందు అధికారానికి ఉదాహరణగా నిలబడ్డాను.

మూడు సార్లు ఏంమ్మెల్యే గా గెలవడమే కాదు, ఈ రోజు పంచాయత్ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్, మహిళా స్త్రీ సంక్షేమం మంత్రి గా ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను.

మనం దళితుల హక్కుల కోసం మాట్లాడుతున్న ఈ సమయంలో, మన పోరాటాలు సమానత్వం, సామాజిక న్యాయం మాత్రమే ఉండకూడదు. మనం సమాజం లోతుగా చొచ్చుకొని ఉన్న వ్యవస్థీకృత అణచివేత పైన పోరాడాల్సిన సమయం వచ్చింది. అదే సమయంలో మనం సాధించిన విజయాల్ని సంబరంగా చేసుకోవలసిన అవసరం కూడా ఉంది. ఆ విజయాలు ఎంత చిన్నవి అయినా సంబరంగా జరుపుకోవాలి, ఎందుకంటే అమరుల త్యాగాల్ని, వారు సాధించిన విజయాల్ని స్మరించాల్సిన అవసరం ఉంది. అయ్యంగర్ పోరాటం మొదలు నంగేలీ వరకు ఎన్నో పోరాటాలు చేశారు. వారు భావి తరాల బాగు కోసం పని చేశారు. ఈ దేశ దళిత ఆదివాసులుగా, మనకి ఒక గొప్ప ప్రతిఘటన మరియు విప్లవ చరిత్ర ఉంది. బ్రిటిష్ మొదలు ఈ రోజు కి మార్పు కోసం చేస్తున్న అస్తిత్వ ఉద్యమాలు అందులో భాగమే. ఈ చరిత్ర నుండి మనం స్ఫూర్తి పొంది, సమసమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మానవాళి చరిత్రలో, దళితులుగా మనం ఎన్నో చీకటి రోజుల్ని చూసాం. కానీ, ప్రతీసారి ఎదురొడ్డి నిలబడ్డాం. పోరాట పటిమను ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ భావి తరాలకు మంచి భవిష్యత్ కోసం పాటుపడదాం.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *