ఎ9 న్యూస్ మార్చ్ 23
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కుషన్ గడ్డ తండాకు చెందిన రైతు పాల్యా జీవుల(50) తనకున్న మూడెకరాల పొలంలో వరి పంటను సాగు చేశాడు
నీళ్లు లేక పంట ఎండిపోవడంతో, పంటను కాపాడుకోవడానికి మూడు కొత్త బోర్లు వేశాడు.. వాటిలో నీరు పడకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది
రూ.4 లక్షల వరకు అప్పు కాగా అప్పు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై రాజిపేట శివారు అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.