A9 news మార్చ్ 23.
ఏటూరునాగారం అటవీశాఖ నార్త్ రేంజ్ అధికారి బాలరాజు 2023 సంవత్సరంలో తునికాకు కూలీలకు వచ్చిన బోనస్ డబ్బులు 2 లక్షల 78 వేయిలను కాజేశాడని బాలరాజు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఏటూరునాగారం పోలీసులు..
సౌత్ రేంజ్ అధికారి ఆప్సరున్నీసా పిర్యాదు మేరకు ఏటూరునాగారం, కన్నాయిగూడెం నార్త్ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బాలరాజు
2023 సంవత్సరంలో ప్రభుత్వం ద్వార తునికాకు కూలీలకు బోనస్ గా వచ్చిన డబ్బులలో 2 లక్షల 78 వేయిల అవినీతికి పాల్పడ్డాడు.
అటవీశాఖ ఖాతాలో జమ అయిన బోనస్ డబ్బులను తునికాకు సేకరణ కూలీలకు అందించాల్సి ఉండగా..
ఖాతలో జమ అయిన డబ్బుల విషయం కూలీలకు తెలియనివ్వకుండా వాటిని కాజేయాలని దుర్భుద్ధితో కింద పని చేస్తున్న బేస్ క్యాంపు సిబ్బందిలో ఇద్దరిని పట్టుకుని నమ్మకంగా ఉండాలని వారిద్దరితో ఏటూరునాగారంలోని మరో ఐదుగురితో కూడి వారి ఖాతాలలో నగదు మల్లించి డ్రా చేసుకున్నాడని విచారణలో వెల్లడైంది.
కాగా బాలరాజు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు ఈ స్కాం వెనక ఇంకెవరి హస్థం ఉందనే పనిలో పడ్డారు.