*మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగు లోకి నీటి విడుద
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
దుబ్బాక కూడవెల్లి వాగు లోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి చేసిన విజ్ఞప్తి కి మంత్రివర్యులు తక్షణమే స్పందించారు.. ఈరోజు అసెంబ్లీ లో మంత్రిని కలిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి పంట పొలాలు ఎండిపోతున్నాయని,కూడవెల్లి వాగు నీళ్లు లేక వట్టి పోయిందని, కూడవెల్లి వాగు లోకి మల్లన్న సాగర్ జలాలు విడిచి దుబ్బాక నియోజకవర్గం లోని రైతుల పంట పొలాలు కాపాడాలని కోరారు.. ఎమ్మెల్యే విజ్ఞప్తి కి స్పందించిన మంత్రివర్యులు వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగులోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. వాగు ప్రవహిస్తున్నందున వాగు పరివాహక రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తాను చేసిన విజ్ఞప్తి కి స్పందించి నీటి విడుదల చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు… అలాగే చిన్న శంకరంపేట, రామాయంపేట కాలువలకు నీటి సరఫరా పెంచాలని మంత్రివర్యులు అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు..