హైదరాబాద్:మార్చి 17

నేడు తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టారు.

వీటితో పాటు.. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటి కంటే ముందు అసెంబ్లీ సమావే శాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సభ నుంచి ఏఐఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు.

స్పీకర్ నడుపుతున్న సభ తీరును వారు నిరసిస్తూ.. వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటిం చారు. ఇది గాంధీభవన్ కాదని.. అసెంబ్లీని అసెంబ్లీ గా నడపాలని ఎంఐఎం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు.. పలు ప్రశ్నలపై మంత్రి సీతక్క సమాధానాలు చెప్పా

*అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం..-

దుబ్బాక నియోజకవర్గంలో బీసీ హాస్టల్‌లో చోటు చేసుకున్న సంఘటనను తెలంగాణ అసెంబ్లీ లో చర్చించడంపై విమర్శలు, వివాదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఈ ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ.. ఆత్మహత్యా యత్నం చేసిన విద్యార్థి గత రెండు రోజులుగా కోమాలో ఉన్నట్లు తెలిపారు.

ఈ సంఘటన భయటకు రాకుండా చేశారని ఫైర్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి ఈ విషయం పై తీవ్రంగా స్పందిస్తూ.. ప్రభుత్వ పక్షం ఎక్కడా ఈ విషయంలో సహాయం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *